
రాష్ట్రస్థాయి పోటీల్లో పారమిత విద్యార్థి ప్రతిభ
కొత్తపల్లి: తెలంగాణ జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి జూడో కెడెట్(జూనియర్స్) చాంపియన్‌షిప్ పోటీల అండర్– 90 కిలోల విభాగంలో పద్మనగర్‌లోని పారమిత హెరిటేజ్ పాఠశాల విద్యార్థి టి.రణవీర్ (10వ తరగతి) అత్యుత్తమ ప్రతిభ కనబరిచి కాంస్య పతకం గెలుచుకున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.గోపికృష్ణ తెలిపారు. విద్యార్థి, వ్యాయామ ఉపాధ్యాయుడు గోలి సుధాకర్‌ను శుక్రవారం పాఠశాల చైర్మన్ డా.ఇ.ప్రసాదరావు, డైరెక్టర్లు ప్రసూన, అనూకర్‌రావు, రశ్మిత, వి.యు.యం.ప్రసాద్, వినోద్ రావు, హన్మంతరావు, సమన్వయకర్త రబీంద్రపాత్రో అభినందించారు.
ఉత్సాహంగా టేబుల్ టెన్నీస్ పోటీలు
కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్ కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఉన్నత పాఠశాలలో సీబీఎస్‌ఈ పాఠశాలల క్లస్టర్–7 బాలికల టేబుల్ టెన్నీస్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సుమారు 35 సీబీఎస్‌ఈ పాఠశాలలు పోటీ పడుతున్నాయి. గురువారం నాటి పోటీలను అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్‌రెడ్డి ప్రారంభించారు. అండర్– 14 విభాగంలో టీం ఈవెంట్‌లో వీపీఎస్ పబ్లిక్ స్కూల్, టైం స్కూల్‌పై, అండర్–17 విభాగంలో శ్రీ ప్రకాశ్ సినర్జీ స్కూల్, సీఆర్‌రెడ్డి పబ్లిక్ స్కూల్‌పై, అండర్–19 విభాగంలో శ్రీ ప్రకాశ్ సీనర్జీ పాఠశాల, సర్ సీఆర్‌రెడ్డి పబ్లిక్ స్కూల్‌పై విజయం సాధించాయి.

రాష్ట్రస్థాయి పోటీల్లో పారమిత విద్యార్థి ప్రతిభ