
అభిషేక ప్రియుడి సేవలో తరించాలని..
వేములవాడ: శ్రావణమాసంలో శివుడికి అభిషేకం చేయాలని ఆరాటంతో భక్తులు తండోపతండాలుగా రాజన్న ఆలయానికి తరలివస్తున్నారు. ప్రధానంగా స్థానికులు చేతుల్లో కలశాలతో రాజన్నకు అభిషేకం చేసేందుకు వేకువజాము నుంచే క్యూ కడుతున్నారు. స్థానికుల రద్దీ పెరుగుతుండడం.. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు టికెట్ తీసుకొని వేచి చూడాల్సి వస్తోందని వరంగల్‌కు చెందిన స్వామి, రాజమల్లయ్య, రాజేశ్వర్, ఉమేందర్, ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టికెట్ కొని తాము గంటల తరబడి క్యూలైన్‌లో నిల్చొంటే.. తమ ముందే వందలాది మంది ఉచితంగా గర్భగుడిలోకి వెళ్లి వస్తున్నారని సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ఈక్రమంలో వారిని కట్టడి చేయడం సిబ్బందికి ఇబ్బందిగా మారింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పా ట్లు చేయాలని కోరుతున్నారు. అయితే శ్రావణమా సం మొదలైనప్పటి నుంచి రాజన్న ఆలయంలో ని త్యం భక్తుల రద్దీ పెరుగుతోంది. ఈ క్రమంలో రాజ న్నను దర్శించుకునేందుకు గంటల తరబడి క్యూలైన్‌లో నిల్చోవడం ఇబ్బందిగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై ఆలయ అధికారులు ఆలోచన చేయాలని కోరుతున్నారు.
పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులు
నిత్యం తెల్లవారుజామున తోపులాట
ఇబ్బంది పడుతున్న సిబ్బంది