
గుజరాత్ నుంచి బ్యాలెట్ బాక్సులు
బోయినపల్లి(చొప్పదండి): స్థానిక సంస్థల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు జిల్లా అధికారులు చురుకుగా చేపడుతున్నారు. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు కావాల్సిన బ్యాలెట్‌బాక్స్‌ల సేకరణకు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశాలతో బోయినపల్లి ఎంపీవో శ్రీధర్, ఇల్లంతకుంట మండలం గాలిపల్లి పంచాయతీ కార్యదర్శి అనిల్, రుద్రంగి మండలం దెవాగత్‌తండా గ్రామ పంచాయతీ కార్యదర్శి కె.శివప్రసాద్ ఈ నెల 4వ తేదీన గుజరాత్‌కు వెళ్లారు. గుజరాత్‌లోని మెహసానా జిల్లా నుంచి సుమారు 1,500 బ్యాలెట్ బాక్స్‌లు రాజన్న సిరిసిల్లకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు వ్యాన్లలో బ్యాలెట్ బాక్స్‌లను సిరిసిల్లకు తరలించారు. ఇంకా కావాల్సిన బ్యాలెట్ బాక్సుల గురించి అక్కడి ప్రభుత్వ కార్యాయాల్లో సేకరిస్తున్నారు. ఈనెల 11వ తేదీ వరకు జిల్లా ఉగ్యోగులు గుజరాత్‌లో ఉండి మిగతా బ్యాలెట్ బాక్స్‌లను సేకరించనున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సేకరణ
రెండు వ్యాన్లలో రాజన్న సిరిసిల్లకు తరలింపు