
అపురూప శిల్పాలపై పట్టింపు కరువు
వేములవాడ: రాజన్న ఆలయ అనుబంధ భీమేశ్వరస్వామి గుడిలో ఏళ్లనాటి అపురూప శిల్పకళపై రాష్ట్ర దేవాదాయశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పురావస్తు పురావాస్తు పరిశీలకుడు నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం భీమేశ్వరాలయంలోని మూలనపడేసిన శిల్పకళా రూపాలను స్థానిక చరిత్రకారుడు సంకెపల్లి నాగేంద్రశర్మతో కలసి పరిశీలించారు. 9వ శతాబ్దం నాటి గణేశ్, ఛాముండి, సప్తమాతలు, శివలింగాలు, నంది, కుబేర, జైన మహవీర, పార్శ్వనాథ శిల్పాలను ఆలయన ఆవరణలో పడేశారన్నారు. అపురూప శిల్పాలను కాపాడాల్సిన బాధ్యత దేవాదాయశాఖ అధికారులపై ఉందన్నారు.
పురావస్తు పరిశీలకుడు నాగిరెడ్డి