
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి
కరీంనగర్‌టౌన్: 108 సేవలు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని, క్షతగాత్రులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ సూచించారు. బుధవారం జిల్లాలోని 108 వాహనాలను పరిశీలించారు. 108 జిల్లా మేనేజర్ సయ్యద్ ఇమ్రాన్‌తో కలసి అంబులెన్స్‌లోని ఔషధాలు వాటి గడువు, వైద్య పరికరాలు, పనితీరు, ఆక్సీజన్ లెవెల్స్, పొర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్ పనితీరు, విషం తాగిన వారికి ఉపయోగించే సక్షన్ మిషన్, ఏఈడీ, లారెంజో స్కోప్, స్ట్రక్చర్, పెడిబోర్డు, సికాలర్, స్ప్లింట్, అంబు బ్యాగ్స్‌ను పరిశీలించారు. స్వామి, సంపత్, తిరుపతి, శ్రీనివాసరెడ్డి, సంపత్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, శ్రీధర్ పాల్గొన్నారు.