
రాఖీ కట్నం
15.48
కోట్లు
విద్యానగర్(కరీంనగర్): రాఖీ పండుగ కరీంనగర్ రీజియన్‌కు కాసుల పంట పండించింది. ఈనెల 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రూ.15.48 కోట్ల ఆదా యం సమకూరింది. పండుగ సందర్భంగా ఈనెల 7వ తేదీనుంచి 11వ తేదీ వరకు రీజియన్ పరిధి లోని 11డిపోల్లో ఉన్న బస్సులు 21.50 లక్షల కిలో మీటర్లు తిరగగా.. 29,10,435 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. వీరిలో 73శాతంపైగా (21,21,668) మహిళలు ఉండగా మహాలక్ష్మి పథ కం ద్వారా రూ.9.08 కోట్లు ఆదాయం వచ్చింది. రాఖీ పౌర్ణమి రోజున ఈనెల 9న రికార్డుస్థాయిలో 7.02 లక్షల మంది రాకపోకలు సాగించగా రూ.3.94 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా గోదావరిఖని డిపో నుంచి 4,28,432 మంది ప్రయాణించారు. వీరిలో 3,21,821మంది మహిళలు ఉన్నారు. మొత్తం రూ.223.79 లక్షల ఆదాయం రాగా.. మహాలక్ష్మీ స్కీంకింద రూ.130.09 లక్షల ఆదాయం వచ్చింది. జగిత్యాల డిపో 3,67,855 మందిని చేరవేసి రెండోస్థానంలో నిలిచింది. వీరిలో 2,71,103 మంది మహిళలున్నారు. మొత్తం ఆదాయం రూ.178.57 లక్షలు రాగా.. జీరో టికెట్లు ద్వారా 104.38లక్షల ఆదాయం వచ్చింది.
ఆర్టీసీకి కరీంనగర్ రీజియన్‌లో లాభాల పంట
గోదావరిఖని డిపోకు మొదటిస్థానం
అందరి సహకారంతోనే
కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోలకు చెందిన సిబ్బంది, డైవర్లు, కండక్టర్లులు, అధికారుల సహకారంతోనే ఇది సాధ్యమైంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా స్పేర్ బస్సులతో పాటు జేబీఎస్ నుంచి సిటీ బస్సులు నడిచేలా చూశాం. 29 లక్షలకు పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశాం.
– బి.రాజు, కరీంనగర్ రీజినల్ మేనేజర్

రాఖీ కట్నం