వడ్డీ లేని రుణాలు సీ్త్రనిధి ద్వారే ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

వడ్డీ లేని రుణాలు సీ్త్రనిధి ద్వారే ఇవ్వండి

Aug 14 2025 7:27 AM | Updated on Aug 14 2025 7:27 AM

వడ్డీ

వడ్డీ లేని రుణాలు సీ్త్రనిధి ద్వారే ఇవ్వండి

కరీంనగర్‌ అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న వడ్డీ లేని రుణాల్లో మొదటి ప్రాధాన్యత సీ్త్ర నిధి రుణాలకు ఇవ్వాలని రాష్ట్ర సీ్త్ర, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశారు. బుధవారం సీ్త్రనిధి ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంత్రిని కలిసి పరిస్థితిని వివరించారు. సీ్త్రనిధి ద్వారా రుణాలివ్వడం వల్ల మహిళల్లో సంస్థపై ఆత్మవిశ్వాసం పెరిగి సంస్థ బలపడటానికి దోహదపడుతుందని వివరించారు. సంస్థ నుంచి వైదొలిగిన పూర్వ ఉద్యోగులు స్వార్ధపూరితంగా, నిరాధారమైన దుష్ప్రచారాన్ని చేస్తున్నారని వివరించారు. వారి తప్పుడు ప్రచారం వల్ల రుణ చెల్లింపులు తగ్గిపోయాయని, సంస్థ ప్రతిష్టను దిగజార్చేలా కొంతమంది పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. సంస్థ ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి సీతక్క హెచ్చరించారని సీ్త్రనిధి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏ.కె.మదర్‌ వివరించారు.

వర్షాలతో అప్రమత్తం

కలెక్టర్‌ పమేలా సత్పతి

కరీంనగర్‌ అర్బన్‌: రానున్న నాలుగు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అన్నిశాఖలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ పమేలా సత్పతి ఆదేశించారు. భారీ వర్షాలు, తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లతో బుధవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సిబ్బందిని 24 గంటలూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. విద్యుత్‌, రెవె న్యూ, పోలీసు, ఆర్‌అండ్‌ బీ, పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌ శాఖలను సమన్వయం చేసుకుని ప్రమాదకరంగా ఉండే నాలాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి ఖాళీ చేయించాలన్నారు. ప్రమాదరంగా ఉన్న చెరువులు, ప్రాజెక్టులను పరిశీలించి లీకేజీలు ఉంటే గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు.

కలెక్టర్లకు కేంద్ర మంత్రి సంజయ్‌ ఫోన్‌..

కరీంనగర్‌టౌన్‌: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ బుధవారం సాయంత్రం కరీంనగర్‌, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు పమేలా సత్పతి, సందీప్‌ కుమార్‌ ఝాకు ఫోన్‌ చేశారు. జిల్లాల్లో ఇప్పటి వరకు కురిసిన వర్షాలు, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. రానున్న మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించిన నేపథ్యంలో తీసుకున్న ముందస్తు జాగ్రత్తలపై ఆరా తీశారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా సిబ్బందిని 24గంటలు అందుబాటులో ఉంచాలన్నారు.

విద్యుత్‌తో జర భద్రం

ఎస్‌ఈ రమేశ్‌బాబు

కొత్తపల్లి(కరీంనగర్‌): జిల్లాలో నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో విద్యుత్‌ వినియోగదారులు, రైతులు జాగ్రత్త వహించాలని టీజీఎన్‌పీడీసీఎల్‌ కరీంనగర్‌ సర్కిల్‌ ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు సూచించారు. ఎప్పటికప్పుడు లోడ్‌ మానిటరింగ్‌ చేస్తున్నామని, మెన్‌, మెటీరియల్‌ సిద్ధంగా ఉంచుకున్నామని తెలిపారు. మొబైల్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వాహనాలను సిద్ధంగా ఉంచామని, ఉద్యోగులకు షిఫ్ట్‌ విధానంలో 24 గంటల విధులు కేటాయించినట్లు స్పష్టం చేశారు. ప్రమాదాలు జరిగితే 8712488004 సెల్‌ నంబర్‌కు ఫోన్‌ చేయాలని తెలిపారు. రైతులు, వినియోగదారులు సొంతంగా విద్యుత్‌కు సంబంధించిన పనులు ఎట్టి పరిస్థితిల్లో చేయకూడదని సూచనలు ఇచ్చారు. తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్‌ తీగలను తాకొద్దన్నారు. రైతులు ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఫ్యూజులు మార్చడం, రిపేరు చేయడం, ఏబీ స్విచ్‌లు ఆపరేట్‌ చేయడం, కాలిన తీగలను సరిచేయడం ప్రమాదకరమని హెచ్చరించారు.

శంకరపట్నం మోడల్‌ స్కూల్‌ పీఈటీల తొలగింపు

కరీంనగర్‌: శంకరపట్నం మోడల్‌ స్కూల్‌ లో చదువుతున్న బాలికలపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పీఈటీ మోహన్‌, తిరుపతిలను ఉద్యోగం నుంచి తొలగిస్తూ బుధవారం కలెక్టర్‌ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీచేశారు. కాంట్రాక్ట్‌/ ఔట్‌సోర్సిగ్‌ నిబంధనల మేరకు వీరిని విధుల నుంచి తొలగించారు. ప్రిన్సిపాల్‌ వి.సరిత, ఇంగ్లిష్‌ (పీజీటీ)గా విధులు నిర్వహిస్తున్న పి.కనక లక్ష్మిలపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్‌ చేయాలని సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు కలెక్టర్‌ సిఫారసు చేశారు.

వడ్డీ లేని రుణాలు సీ్త్రనిధి ద్వారే ఇవ్వండి1
1/1

వడ్డీ లేని రుణాలు సీ్త్రనిధి ద్వారే ఇవ్వండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement