
అన్యాయంగా ఇల్లు కూల్చారు
కరీంనగర్ కార్పొరేషన్ పరిధి లోని అలుగునూరులో రేకులషెడ్డు వేసుకుని జీవనం సాగి స్తున్నా. మా ఇంటిని ఎలాంటి కారణం లేకుండా మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. గతంలోనే ఇంటికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు మున్సిపల్ అధికారులకు ఇచ్చాను. నిబంధనలకు అనుగుణంగానే రేకుల షెడ్డు నిర్మించుకున్నా. అయినా మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణం అనడంతో కోర్టును ఆశ్రయించి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చా. అయినప్పటికీ మున్సిపల్ అధికారులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో నా ఇంటిని కూల్చివేసి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలి.
– పిల్లి లక్ష్మి, అలుగునూరు