
వైభవం.. నృసింహుని రథోత్సవం
ధర్మారం(ధర్మపురి): ఖిలావనపర్తి గ్రామంలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి రథోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు భారీసంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ తదితరులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో కాంతారెడ్డి ఆధ్వర్యంలో భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు.