
అకాల వర్షంతో ఆందోళన
కరీంనగర్‌రూరల్: రైతులకు వరిపంట పండించడం ఒక ఎత్తయితే, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించడం మరొక ఎత్తవుతోంది. అకాల వర్షాలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. గురువారం సాయంత్రం, రాత్రి వేళల్లో కురిసిన వర్షంతో శుక్రవారం కరీంనగర్ మండలంలోని పలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. చెర్లభూత్కూర్, జూబ్లీనగర్, దుబ్బపల్లి గ్రామాల్లోని కేంద్రాల్లో నిర్వాహకులు కాంటా పెట్టలేదు. రైతులు తడిసిన ధాన్యం ఆరపెట్టేందుకు పడరానీపాట్లు పడుతున్నారు. ధాన్యం కుప్పలపై కప్పిన టార్పాలిన్లను తొలగించి ధాన్యం ఆరపెట్టారు. తేమ ఎక్కువగా ఉందంటూ కాంటా పెట్టకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయిందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. నగునూరులో గురువారం కురిసిన వర్షానికి 1500 బస్తాల లోడింగ్ నిలిచిపోయింది. శుక్రవారం కాంటా పెట్టడంతో మొత్తం 3500 బస్తాలు, వ్యవసాయ మార్కెట్‌లో 2వేల బస్తాలను హమాలీలు లారీల్లో లోడింగ్ చేసి పంపించారు. అయితే వర్షాలకు ధాన్యం తడవడంతో పాటు ఆలస్యంగా వరికోతలతో ధాన్యంలో తేమశాతం ఎక్కువగా ఉండటంతో జూబ్లీనగర్, దుబ్బపల్లి, చెర్లభూత్కూర్‌లో కాంటా పెట్టడం లేదని కరీంనగర్ సింగిల్‌విండో సీఈవో రమేశ్ తెలిపారు.
కొనుగోలు కేంద్రాల్లో నిలిచిన కాంటాలు

అకాల వర్షంతో ఆందోళన

అకాల వర్షంతో ఆందోళన