యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): మద్యం మత్తులో భర్త తన భార్యపై దాడిచేశాడు. గోదావరిఖని టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక బంగ్లాస్ ఏరియాలోని సర్వెంట్ క్వార్టర్‌లో శ్రీను –స్వప్న దంపతులు నివాసం ఉంటున్నారు. శ్రీను మేషన్ పనిచేస్తున్నాడు. స్వప్న బంగ్లాస్ ఏరియాలోని క్యార్టర్లలో పనిచేస్తోంది. తరచూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు. ఈక్రమంలో శుక్రవారం మద్యం తాగి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఆ మత్తులో భార్యపై దాడి చేశాడు. ఈక్రమంలో అతి చేతిలోని బ్లేడ్ తగిలి స్వప్న గాయపడింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇద్దరిని గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.