ద‌య‌చేసి 'న్యూ ఇయ‌ర్' రోజు ఇటువైపు వెళ్ల‌కండి! | Sakshi
Sakshi News home page

ద‌య‌చేసి 'న్యూ ఇయ‌ర్' రోజు ఇటువైపు వెళ్ల‌కండి!

Published Sun, Dec 31 2023 1:18 AM

- - Sakshi

కరీంనగర్‌: న్యూ ఇయర్‌ సందర్భంగా లోయర్‌ మానేరు డ్యాం, కేబుల్‌ బ్రిడ్జిపైకి వెళ్లడాన్ని నిషేధిస్తున్నట్లు సీపీ అభిషేక్‌ మహంతి ఒక ప్రకటనలో తెలి పారు. కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్‌ 31(ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి జనవరి 01(సోమవారం) ఉదయం 5 గంటల వరకు ఎల్‌ఎండీ కట్ట, తీగల వంతెనపై ఆ ంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు.

వేడుకలు జరుపుకునేందుకు వాటి పైకి అనుమతించబోమన్నారు. వాహనదారులు గమనించి, ఇతర మార్గాల్లో వెళ్లాలన్నారు. అలాగే, రోడ్లమీద వేడుకలు నిర్వహించడం, డీజేలను వినియోగించడం, బైక్‌ సైలెన్సర్లను మార్చి శబ్ధ కాలుష్యం చేస్తూ రోడ్లపై తిరగడం, ట్రిపుల్‌ రైడింగ్‌ వంటి వాటికి అనుమతి లేదని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, ముందస్తు అ నుమతి లేకుండా జనసమూహంగా ఏర్పడి, కార్యక్రమాలు చేపట్టినా, ప్రైవేట్‌ పార్టీలు నిర్వహించినా, ప్రజాశాంతికి భంగం కలిగించేలా వ్యవహరించినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవి చ‌ద‌వండి: భార్య మృతి.. ఆ కొద్ది సేపటికే భర్త కూడా!

Advertisement
Advertisement