భూసేకరణను వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

భూసేకరణను వేగవంతం చేయాలి

Nov 18 2026 1:02 AM | Updated on Nov 18 2026 1:02 AM

భూసేకరణను వేగవంతం చేయాలి ప్రతి కుటుంబానికి బీమా రక్షణ

ఖేలో ఇండియా పోస్టర్ల ఆవిష్కరణ

● అధికారులు సమన్వయంతో పనిచేయాలి

● గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలి

● కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

కామారెడ్డి టౌన్‌ : జిల్లాలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి చేపట్టిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ సూచించారు. గడువులోగా ప్రక్రియను పూర్తి చేయా లని ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో నీటిపారుదల, జాతీయ రహదారు లు, రైల్వే శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ప్యాకేజీ–22, మంజీర ఎత్తిపోతల పథకం, రైల్వే ప్రాజెక్టులతో పా టు ఎన్‌హెచ్‌ పరిధిలోని ఎల్లారెడ్డి –రుద్రూర్‌ సెక్షన్‌, 765డీ ఎల్లారెడ్డి –మెదక్‌ సెక్షన్‌, ఎన్‌హెచ్‌–166బీబీ రహదారి పనుల భూసేకరణలో పురోగతిపై చర్చించారు. ప్రాజెక్టుల వారీగా పెండింగ్‌ సమస్యలను గు ర్తించి, అన్ని శాఖలు సమన్వయంతో వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ విక్టర్‌, బాన్సువాడ, ఎల్లారెడ్డి ఆర్డీవోలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్‌: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా జిల్లాలోని ప్రతి అర్హత కలిగిన కు టుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పథకం విధివిధానాలపై కలెక్టర్‌ అవగాహన కల్పించారు. ఈనెల 19 నుంచి డిసెంబర్‌ 18 వరకు అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్‌ వార్డుల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెలవు దినాలు మినహా రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వ రకు నమోదు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అర్హ త గల కుటుంబంలో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వ యసున్న ఒకరికి మాత్రమే బీమా వర్తిస్తుందన్నారు. రేషన్‌ కార్డు నంబరునే దరఖాస్తు సంఖ్యగా పరిగణిస్తామని, కార్డు లేని వారికి ప్రత్యేక కోడ్‌ కేటాయి స్తామని పేర్కొన్నారు. రేషన్‌ కార్డులో ఈకేవైసీ పెండింగ్‌లో ఉన్నవారు వెంటనే పూర్తి చేసుకోవాలని సూచించారు. బీమా పొందే వ్యక్తి ఆధార్‌ ప్రతి, మొ బైల్‌ నంబర్‌తో శిబిరానికి స్వయంగా హాజరై నామినీల వివరాలు అందించి సంతకం చేయాలని, ఇత రులు తెచ్చే దరఖాస్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ స్వీకరించబోమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీవో రఘునందన్‌, డీఆర్‌డీవో దామోదర్‌రెడ్డి, జెడ్పీ సీఈ వో చందర్‌, జిల్లా ఉద్యాన శాఖ అధికారి జ్యోతి, డీఎస్‌వో వెంకటేష్‌, డీఎం శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్‌: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించను న్న ‘ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌–2026’ ప్ర చార పోస్టర్లను మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ ఆవిష్కరించారు. ఈ క్రీడా పోటీలపై జి ల్లాలో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు, ప్రభు త్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో పోస్టర్లు వే యాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ విక్టర్‌, ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్‌, జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకటేశ్వర్‌ గౌడ్‌, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి సౌజన్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement