ధాన్యం సేకరణను వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం సేకరణను వేగవంతం చేయాలి

Nov 18 2026 1:02 AM | Updated on Nov 18 2026 1:02 AM

ధాన్యం సేకరణను వేగవంతం చేయాలి

కామారెడ్డి టౌన్‌: వానాకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. సమన్వయంతో పనిచేస్తూ రైతుల నుంచి సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. కేంద్రాలలో మౌలిక వసతులు, ఇతర ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ విక్టర్‌, జిల్లా పౌర సరఫరాల సంస్థ అధికారులు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మేనేజర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement