ప్రైవేటులోనే విక్రయం | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటులోనే విక్రయం

Nov 18 2026 1:02 AM | Updated on Nov 18 2026 1:02 AM

ప్రైవేటులోనే విక్రయం దిగుబడి బాలేదు.. ప్రభుత్వం ఆదుకోవాలి

ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో పత్తి సాగు చేసిన రైతులకు తీవ్ర నష్టం జరిగింది. మొక్కలు ఎండిపోతుండడంతో పత్తి ఒక్కసారే వస్తోంది. ఎకరాకు కనీసం నాలుగైదు క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదు. ప్రస్తుతం ధర బాగుంది. దిగుబడి ఉంటే మంచి లాభాలు వచ్చేవి. – నాందేవ్‌, రైతు, మద్నూర్‌

గతంలో ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. వర్షాలు లేక పత్తి పంట సరిగ్గా ఎదగలేదు. చెట్టుకు 20 కాయలు కూడా కాయలేదు. దీంతో ఈసారి 4 క్వింటాళ్లే వచ్చింది. రైతులం నష్టపోతున్నాం. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలి.

– తుకారాం, రైతు, మద్నూర్‌

పత్తి పంటకు ప్రభుత్వం క్వింటాలుకు రూ. 8,667 మద్దతు ధర నిర్ణయించింది. అయితే బ హిరంగ మార్కెట్‌లో క్వింటాలుకు రూ. 9,050 నుంచి రూ. 9,200 వరకు ధర పలుకుతోంది. పంట చేతికి రావడం ప్రారంభమైన మొదట్లో క్వింటాలుకు రూ. 9,500 వరకు కూడా పలికింది. సీసీఐ ధర కంటే ప్రైవేటులోనే ఎక్కువ ధర లభిస్తుండడంతో రైతులు వ్యాపారులకే పంటను విక్రయించడానికి ఆసక్తి చూపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement