కామారెడ్డి అర్బన్: కామారెడ్డి రక్తదాతల సమూహం వ్యవస్థాపకుడు, ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా డైరెక్టర్ బాలు ఉత్తరప్రదేశ్ వృత్తి విద్యా, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి కపిల్‌దేవ్ చేతుల మీదుగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్(ఐవీఎఫ్) జాతీయ స్థాయి శ్రీరాందాస్ అగర్వాల్ జన్‌సేవా సమ్మాన్ పురస్కారం–2026 అందుకున్నారు. బాలు 19 ఏళ్లుగా 84 సార్లు రక్తదానం చేశారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరాల ద్వారా ఏడు వేల యూనిట్ల రక్తం సేకరించారు. ఐవీఎఫ్ న్యూఢిల్లీలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు అశోక్ అగర్వాల్, జాతీయ వర్కింగ్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, మాజీ ఎంపీ అనిల్ అగర్వాల్, జాతీయ కోశాధికారి దినేశ్చంద్, సెంట్రల్ కమిటీ సభ్యులు కే.రమేశ్, నీల భైరయ్య తదితరులు పాల్గొన్నారు.


