దైవచింతన.. దేశభక్తి.. సమాజ సేవ | - | Sakshi
Sakshi News home page

దైవచింతన.. దేశభక్తి.. సమాజ సేవ

Nov 2 2026 1:17 AM | Updated on Nov 2 2026 1:17 AM

సమితిలో ఎవరైనా చేరవచ్చు

● స్ఫూర్తిదాయకంగా

ఏకచక్ర సేవా సమితి కార్యక్రమాలు

● బోధన్‌ చరిత్ర, కీర్తిచాటేలా అడుగులు

బోధన్‌: పట్టణంలోని ఏకచక్ర సేవా సమితి దైవ, దేశ భక్తి, సమాజ శ్రేయస్సు కోసం చేపడుతున్న కార్యక్రమాలతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. బోధన్‌కు ఉన్న చారిత్రక పేరు ’ఏకచక్రపురం’ను తనలో అంతర్లీనం చేసుకుని ‘ఏకచక్ర సేవా సమితి’ పేరుతో స్వచ్ఛంద సంస్థగా 2019లో ఆవిర్భవించగా.. విశేష కార్యక్రమాలతో పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. సమితి అధ్యక్షుడు అంకు మహేశ్‌తోపాటు ప్రతినిధులు, సభ్యులు శ్రీనివాస్‌రావు, లక్ష్మణ్‌పటేల్‌, చల్లా శ్రీనివాస్‌, శంకర్‌, శ్రీనివాస్‌, నేపాల్‌ సింగ్‌, సంగెం శ్రీనివాస్‌, లక్ష్మణ్‌ చౌహాన్‌, పులి సాయిలు, రవిగౌడ్‌, రవీందర్‌, ఆనంద్‌ తదితరులు సమితి కార్యక్రమాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. సమితి ఆవిర్భానికి ముందు సభ్యులు మరో సంస్థ ఏకచక్ర గోరక్షసమితి ఏర్పాటులో కీలక పాత్ర వహించారు. స్థానిక ఏకచక్రేశ్వరాలయం వద్ద గోరక్షణ సమితి నేతృత్వంలో గోశాలను నిర్వహిస్తోంది.

పట్టణంలోని కొంతమంది యువకులు మొదట యూనిటి ఫర్‌ సేవా వాట్సాఫ్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేసి, సేవ కార్యక్రమాలు మొదలు పెట్టగా విశేష స్పందన వచ్చింది. దీంతో సమితి ఏర్పాటుకు దారి తీసింది. ప్రస్తుతం 15 మంది సభ్యులతో సమితి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రతి ఒక్కరిలో జాతీయ సమైక్యత, దేశ భక్తి భావజాలం, ఆధ్యాత్మికంగా జాగృతి, సామాజిక బాధ్యత, సేవా ధృక్పథం పెంపొందించాలనే విశిష్ట లక్ష్యాన్ని సమితి సభ్యులు ఎంచుకున్నారు. సమితి ఆధ్వర్యంలో గత మూడేళ్లుగా హోలీ వేడుకలను రసాయన, కల్తీ రంగులకు బదులు ప్రకృతి సహజ సిద్ధమైన ముల్తానీ మట్టి, పసుపు, మొగిలిపువ్వుతో తయారు చేసిన రంగులతో జరుపుతున్నారు. ప్రతిఏటా పట్టణంలో సాగే పూరి జగన్నాథ ఽరథయాత్ర సమయంలో మహాహారతి కార్యక్రమం నిర్వహిస్తు భక్తులను భాగస్వాములను చేస్తున్నారు. పట్టణంలో రూ.10 లక్షల వ్యయంతో దాతల సహకారం తీసుకుని 101 అడుగుల ఎత్తైన జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. గతేడాది గణతంత్ర దినోత్సవం రోజున ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కరోన విపత్కర సమయంలో నిరుపేదలు, వలస కూలీలకు ఉచితంగా భోజన సౌకర్యం, మెడిసిన్స్‌ అందించారు. 2022–24 వరకు రూ. 10లకే భోజన కార్యక్రమాన్ని రెండేళ్ల పాటు కొనసాగించారు. ఇతర స్వచ్చంద సేవా సంస్థలు, సామాజిక కార్యకర్తలు,దేశ కోసం సేవలందించిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగులను సన్మానించి, గౌరవించే కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇలా విశేష కార్యక్రమాలను నిర్వహిస్తూ సంస్థ ఆదర్శంగా నిలుస్తోంది.

ప్రతి ఒక్కరిలో దేశభక్తి, దైవచింతన, సామాజిక బాధ్యత, సేవా ధృక్పథం అలవడాలనేదే సమితి ఆశయం. ఆధ్యాత్మిక విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలు భావితరానికి అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. స్వచ్ఛందంగా సేవలందించాలనే ఆలోచన, ఆసక్తి ఉన్న వారు ఎవరైనా సమితిలో సభ్యులుగా చేరవచ్చు. – అంకు మహేశ్‌,

ఏకచక్ర సేవా సమితి, అధ్యక్షుడు బోధన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement