● కామారెడ్డి జిల్లాకు చెందిన ఒకరి మృతి
● మరో ఇద్దరికి గాయాలు
దేవరుప్పుల: రోడ్డు ప్ర మాదంలో తల్లి తనువు చా లించగా.. తండ్రి, కూతు రు గాయాలపాలైన ఘట న జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సీతారాంపురం పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. కామారెడ్డి జిల్లాకు చెందిన చెవ్వుల పోచయ్య వ్యవ సాయ శాఖలో విధులు ని ర్వహిస్తున్నాడు. తన కూ తురు స్వర్ణప్రియ ఇటీవల సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో బీఎస్సీ అగ్రికల్చర్లో మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందింది. కాగా ఈ నెల 3న అగ్రికల్చర్ స్లైడింగ్ ఆప్షన్ ఉంది. సమీప ప్రాంతాల్లోకి మార్చుకునేందుకు సంసిద్ధమైన పోచయ్య ఆదివారం తమ కూతురును స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు కారులో భార్య పద్మతో హుజూర్‌నగర్‌కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారి వాహనాన్ని దేవరుప్పుల మండలం సీతారాంపురం బస్‌స్టాండ్ సమీపంలోని మలుపు వద్ద టాటాఏస్ వాహనం ఢీకొట్టింది. ఈఘటనలో కారులో ఎయిర్ బ్యాగులు ఓపెన్ కావడంతో డ్రైవింగ్ చేస్తున్న పోచయ్యకు స్వల్ప గాయాలు కాగా.. భార్య పద్మ, కూతురుకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని అంబులెన్స్‌లో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్న క్రమంలో పద్మ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పద్మ మృతదేహాన్ని జనగామ ఏరియా ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదిలో భద్రపర్చారు.
ప్రమాదంలో దెబ్బతిన్న వాహనాలు


