ఎల్లారెడ్డిరూరల్: ఎల్‌నినో ప్రభావం అన్ని రంగాల పై ప్రభావాన్ని చూపుతోంది. ప్రస్తుతం సాగు, తా గు నీటి ఇబ్బందులు అన్నదాతలు, ప్రజలు ఎదు ర్కొంటుండగా, మరోవైపు అధిక ఉష్ణోగ్రత ప్రభా వం ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈక్రమంలో ఎల్‌నినో సాకుతో ఎండు గడ్డి ధరలను అమాంతం పెంచేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
డిమాండ్ పెరగడంతో..
ఎల్‌నినో కారణంగా సరిపడా వర్షాలు కురవకపోవడంతో చాలా జిల్లాల్లో పంటలు పండక రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం సైతం 300కు పైగా మండలాలలో కరువుగా గుర్తించింది. దీంతో పంటలు పండక పోగా నష్టం వాటిళ్లింది. దీంతోపాటు పాడి రంగంపైన దీని ప్రభావం అధికంగా ఉంది. పంటలు పండని కారణంగా పశువులకు కావాల్సిన ఎండు గడ్డి లభించక పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది ఎండు గడ్డి ట్రాక్టర్ ధర రూ.5వేల నుంచి రూ.8వేల వరకు ఉండగా ప్రస్తుతం దీని ధర రూ.10వేల నుంచి రూ.12వేలకు పెరిగింది. దీంతో గడ్డి దొరకక పాడి రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గడ్డి ధరలు పెరగడంతో రైతులు లీటర్ పాల ధరను సైతం పెంచేశారు. 60 రూపాయలకు లీటర్ ఉన్న పాల ధర 80 రూపాయలకు పెరిగింది. దీంతో పాడి రైతులతో పాటు సాధారణ ప్రజలు పెరిగిన ధరల కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గడ్డి ధరలు తగ్గించేలా ప్రభుత్వం తగిన చర్యలను చేపట్టాలని పాడి రైతులు కోరుతున్నారు.
ఎల్‌నినో ప్రభావంతో అమాంతం
పెంచేసిన నిర్వాహకులు
రూ.8వేల నుంచి రూ.12 వేలకు
పెరిగిన ట్రాక్టర్ ఎండు గడ్డి


