క్రికెట్‌ హబ్‌గా ఇందిరాగాంధీ స్టేడియం | - | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ హబ్‌గా ఇందిరాగాంధీ స్టేడియం

Oct 27 2026 12:44 AM | Updated on Oct 27 2026 12:44 AM

క్రికెట్‌ హబ్‌గా ఇందిరాగాంధీ స్టేడియం

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియాన్ని క్రికెట్‌ అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్ది, స్థానిక యువతకు అత్యుత్తమ క్రీడా సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) కార్యదర్శి జీవన్‌రెడ్డి, సీఈవో ఇంతియాజ్‌ ఖాన్‌, కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌లతో కలిసి ఆయన స్టేడియాన్ని పరిశీలించారు. మైదానంలో వసతులు, పిచ్‌ నిర్మాణం, ప్రాక్టీస్‌ నెట్స్‌ ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ పేదరికం కారణంగా ఏ ఒక్క క్రీడాకారుడూ వెనకబడకూడదనే ఉద్దేశంతో హెచ్‌సీఏ సహకారంతో మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నామన్నారు. నాణ్యమైన పిచ్‌ను సిద్ధం చేసి, హెచ్‌సీఏ ఆధ్వర్యంలో అండర్‌–19 మ్యాచ్‌లు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

వారం రోజుల్లో ప్రైవేట్‌ కోచ్‌లను నియమించి, మూడు ప్రాక్టీస్‌ నెట్లతో పాటు అవసరమైన క్రీడా సామగ్రిని అందజేస్తామని హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్‌రెడ్డి వెల్లడించారు. స్టేడియం నిర్వహణ బాధ్యతలను హెచ్‌సీఏ పరిధిలోకి తీసుకునే అంశాన్ని త్వరలో జరిగే సమావేశంలో చర్చిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రకాంత్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఇప్ప ఉమారాణి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి, నాయకులు సందీప్‌, గూడెం శ్రీనివాస్‌, రాజా గౌడ్‌, రెడ్డి నాయక్‌, భూమని బాలరాజ్‌, గోనె శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

వారం రోజుల్లో ప్రైవేట్‌ కోచ్‌ల

నియామకం, 3 ప్రాక్టీస్‌ నెట్ల ఏర్పాటు

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ

హెచ్‌సీఏ బృందం, కలెక్టర్‌తో

కలిసి స్టేడియం పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement