సర్‌ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

సర్‌ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి

Oct 27 2026 12:44 AM | Updated on Oct 27 2026 12:44 AM

సర్‌ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి

● నిబంధనల ప్రకారం

అభ్యంతరాలను పరిష్కరించాలి

● అధికారులతో కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

కామారెడ్డి టౌన్‌ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను అధికారులు సమర్థవంతంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఎస్‌ఐఆర్‌ పురోగతితో పాటు క్లెయిమ్స్‌, అభ్యంతరాల తాజా స్థితిగతులపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్‌ జిల్లా అధికారులతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. వచ్చిన క్లెయిమ్స్‌, అభ్యంతరాలను క్షేత్రస్థాయి పరిశీలించి, గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా జాబితాను రూపొందించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎన్‌వై గిరి, ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్‌ రవితేజ, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement