కామారెడ్డి టౌన్: జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్‌ఎం) కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం 10వ రోజుకు చేరింది. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉద్యోగులంతా తెల్లని దుస్తులు ధరించి శాంతియుతంగా నిరసన తెలిపారు. సమస్యలను పరిష్కరించేంత వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. శిబిరాన్ని జిల్లా బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు బాజా లలిత సందర్శించి సంపూర్ణ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి సుమన్, ప్రధాన కార్యదర్శి బట్టు పద్మజ, నాయకులు వెంకటరమణ, అశ్విని, మౌనిక, అఖిల్, సందీప్, స్వాతి, స్వరూప, వైద్యులు హరీశ్, వేణుమాధవ్, రాహుల్, మీనాక్షి, రవళి, స్వాతి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.


