పెద్దకొడపగల్(జుక్కల్): ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలి ఇంట్లోకి రాత్రి వేళ ప్రవేశించి, ఆమెను బెదిరించి మెడలోని గొలుసును చోరీ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. లింగంపేట మండలం కంచుమల్ గ్రామానికి చెందిన ఎగ్గడి నవీన్ కుమార్ హైదరాబాద్‌లో ప్రయివేటు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో అంజని గ్రామంలో ఒంటరిగా నివాసముంటున్న తన పెద్ద మ్మ బేగరి బాలవ్వ (60) మెడలోని బంగారు గొ లుసును దొంగిలించాలని పథకం పన్నాడు. సెప్టెంబర్ 30న రాత్రి బాలవ్వ ఇంట్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న వృద్ధురాలి నోరు నొక్కి, మెడలోని పసుపు తాడును బంగారు గొలుసు అనుకొని ఎత్తుకెళ్లాడు. బాధితురాలు నిందితుడి చేతిని కొరకడంతో కత్తెరతోపాటు పారిపోయే క్రమంలో ఫెన్సింగ్‌కు తట్టుకున్న టీషర్టును వదిలేసి పరారయ్యాడు. గురువారం అంజనీ గేటు వద్ద ఎస్సై అరుణ్ కుమార్ నిందితుడిని పట్టుకొని అతని నుంచి మోటారు సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. బిచ్కుంద కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.


