రామారెడ్డి(ఎల్లారెడ్డి): కుటుంబ కలహాలతో ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రామారెడ్డి మండలం జగదాంబ తండాలో చోటుచేసుకుంది. ఎస్సై మురళి తెలిపిన వివరాల ప్రకారం.. జగదాంబ తండా గ్రామానికి చెందిన రాలబండి కల్యాణ్‌కు, అతని భార్య లాస్యకు నెల రోజుల క్రితం కుటుంబ కలహాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో లాస్య తన కుమార్తె ఆధ్యను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. మనస్తాపానికి గురైన కల్యాణ్ గురువారం ఉదయం తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మురళి తెలిపారు.
నవీపేటలో ఒకరు..
నవీపేట: మండల కేంద్రంలోని సుభాష్‌నగర్ కాలనీకి చెందిన కొండూరు నవీన్‌కుమార్(35) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్రీకాంత్ గురువారం తెలిపారు. మద్యానికి బానిసైన నవీన్‌కుమార్ బుధవారం రాత్రి మద్యం సేవించేందుకు డబ్బులు ఇవ్వాలని భార్య కొండూరు లక్ష్మితో వాదనకు దిగాడు. ఆమె డబ్బులు లేవని చెప్పి, దుర్గామాత శోభాయాత్రను చూసేందుకు వెళ్లింది. రాత్రి ఇంటికి వచ్చిన లక్ష్మి తలుపులు తీసేందుకు ప్రయత్నించగా లోపల గడియ పెట్టుకోవడంతో తలుపులు పగులగొట్టారు. లోపల దూలానికి ఉరేసుకొని నవీన్‌కుమార్ విగత జీవిగా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


