● తృటిలో తప్పిన ప్రమాదం
లింగంపేట(ఎల్లారెడ్డి): టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్తతో ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన గురువారం లింగంపేట మండలంలో చోటు చేసుకుంది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ఎల్లమ్మ తండా సమీపంలో ఓ టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్తగా వేగంగా నడుపుతూ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టే ప్రయత్నం చేశాడు. ప్రమాదాన్ని గమనించిన బస్సు డ్రైవర్ అప్రమత్తమై బస్సును కల్వర్టు చివరి వరకు తీసుకెళ్లి నిలిపివేశాడు. టిప్పర్ డ్రైవర్ వాహనాన్ని నిలిపివేయకుండా ముందుకు రావడంతో బస్సును రాసుకుంటూ వెళ్లి కల్వర్టు మధ్యలో ఇరుక్కున్నాయి. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు కేకలు వేస్తూ భయాందోళనకు గురయ్యారు. కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. రెండు వాహనాలు కల్వర్టు మధ్యలో ఇరుక్కోవడంతో కామారెడ్డి– ఎల్లారెడ్డి రోడ్డుపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. ఎస్సై దీపక్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని టిప్పర్‌ను ముందుకు తీయించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.


