ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ను ప్రభుత్వం ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ను ప్రభుత్వం ఆదుకోవాలి

Oct 18 2026 1:00 AM | Updated on Oct 18 2026 1:00 AM

● ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

● ఐదో రోజుకు చేరిన

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె

కామారెడ్డి టౌన్‌: రాష్ట్రంలో ప్రజల ప్రాణాలను కాపాడుతున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని నియోజకవర్గ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి(కేవీఆర్‌) డిమాండ్‌ చేశారు. జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం)లో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన పనిచేస్తున్న ఉద్యోగుల నిరవధిక సమ్మె శనివారం ఐదో రోజుకు చేరింది. మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఉద్యోగులు చేపట్టిన దీక్షను ఎమ్మెల్యే సందర్శించి వారికి మద్దుతు పలికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేవీఆర్‌ మాట్లాడుతూ.. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన వైద్య ఉద్యోగుల బాధలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి అర్థం చేసుకోవాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్‌ చేసి, రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా కనీస వేతనం అందజేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, బీజేపీ రాష్ట్ర నాయకుడు, సైంటిస్ట్‌ డాక్టర్‌ పైడి ఎల్లారెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ కాసర్ల గోదావరిలు సమ్మెకు మద్దతు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్‌ చేశారు. సమ్మెలో భాగంగా ఉద్యోగులు రోడ్డుపై బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సంఘం జేఏసీ జిల్లా అధ్యక్షుడు సుమన్‌, ప్రధాన కార్యదర్శి బట్టు పద్మజ, గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ మారుతి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ హరీశ్‌, నాయకులు, వైద్యులు చైతన్య, రాజశేఖర్‌, వెంకట్‌స్వామి, వేణుమాధవ్‌, రాహుల్‌, రాజు, సందీప్‌, అశ్విని, డాక్టర్‌ మౌనిక, శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement