ఆలయానికి భక్తుల విరాళాలు | - | Sakshi
Sakshi News home page

ఆలయానికి భక్తుల విరాళాలు

Oct 18 2026 1:00 AM | Updated on Oct 18 2026 1:00 AM

ఆలయానికి భక్తుల విరాళాలు ఇత్తడి వస్తువుల తయారీ దుకాణంలో చోరీ

దోమకొండ: మండలంలోని ముత్యంపేట గ్రామ వీరప్రతాప ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు శనివారం విరాళాలు అందజేశారు. కామారెడ్డికి చెందిన సోలేటి లక్ష్మీ అంజయ్య జ్థాపకార్థం వారి కుమారుడు సోలేటి సంతోష్‌కుమార్‌ రూ.51,116 అందజేశారు. ఆయనతో పాటు కామారెడ్డికి చెందిన తిరుమల బటన్‌స్టోర్‌ యజమానులు చంద్రశేఖర్‌, సాయి ట్రేడర్స్‌ యజమాని తులసి ఆలయానికి రూ.51 వేల చొప్పున విరాళం అందజేసినట్లు ఆలయ కమిటి అధ్యక్షుడు పవన్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు. వీరిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు బాపురెడ్డి, ప్రవీణ్‌, అంజయ్య, దుర్గాప్రసాద్‌, హరీశ్‌ స్వామి, సిద్ధాగౌడ్‌, సవీన్‌ గౌడ్‌, అర్చకులు రామేశం శర్మ తదితరులు పాల్గొన్నారు.

ఇద్దరు హోంగార్డుల సరెండర్‌

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లా రవాణా శాఖలో పనిచేస్తున్న ఇద్దరు హోంగార్డులను పోలీసు శాఖకు సరెండర్‌ చేసినట్లు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ దుర్గాప్రమీల తెలిపారు. ఆర్మూర్‌ పరిధిలో పనిచేస్తున్న దశరథ్‌, మొబైల్‌ స్కాడ్‌లో పనిచేస్తున్న భాస్కర్‌ను సరెండర్‌ చేశారు. వీరిద్దరిపై కొన్నేళ్లుగా అనేక అవినీతి ఆరోపణలు రాగా, విచారణ అనంతరం సరెండర్‌ చేసినట్లు ఆమె తెలిపారు.

ఆర్మూర్‌ టౌన్‌: పట్టణంలోని జిరాయత్‌నగర్‌ శివాలయం పక్కన ఇత్తడి వస్తువుల తయారీ దుకాణంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. దుకాణ యజమాని సయ్యద్‌ శుక్రవారం రాత్రి దుకాణానికి తాళం వేసి వెళ్లాడు. శనివారం తెల్లవారుజాము 3 గంటలకు హైదరాబాద్‌కు వెళ్లి మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి వచ్చారు. అదే సమయంలో ఓ వ్యక్తి దుకాణానికి వచ్చి కొన్ని వస్తువులు తయారు చేయించేందుకు ఫోన్‌లో సంప్రదించగా సయ్యద్‌ దుకాణానికి చేరుకున్నాడు. దుకాణం తాళం తీసి లోపలికి వెళ్లగా, వెనుక వైపు ఉన్న డోర్‌ తెరిచి ఉండటంతోపాటు సామగ్రి చెల్లాచెదురుగా పడి ఉన్నాయని బాధితుడు గుర్తించారు. 60 ఇత్తడి గంటలు, 30 కిలోల శ్రీ చక్రం, వెండి తోరణం తదితర వస్తువులు అపహరణకు గురైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లకు శిక్షణ

నిజామాబాద్‌ లీగల్‌: తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ యస్‌. సాంబశివ రెడ్డి ఆదేశాల మేరకు డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ ఎం. రజిని ఆధ్వర్యంలో నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లకు శనివారం ఆర్గనైజింగ్‌ కేసులపై శిక్షణ నిర్వహించారు. కొత్తగా వచ్చిన బీఎన్‌ఎస్‌ చట్టం, భారత ప్రభుత్వ హోం వ్యవహారాల శాఖ జారీ చేసిన వ్యక్తుల అక్రమ రవాణా నిరోధక చట్టంపై చర్చించారు. మానవ అక్రమరవాణాను అరికట్టేందుకు సాంకేతికత ఎలా ఉపయోగించాలో వివరించారు. సమావేశంలో నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement