పండుగ వేళ.. మార్కెట్‌ కళకళ | - | Sakshi
Sakshi News home page

పండుగ వేళ.. మార్కెట్‌ కళకళ

Oct 18 2026 1:00 AM | Updated on Oct 18 2026 1:00 AM

కామారెడ్డి టౌన్‌: బతుకమ్మ, దసరా సందర్భంగా జిల్లా కేంద్రంలో పండుగ వాతావరణంతో సందడి నెలకొంది. నేడు బతుకమ్మ పండుగ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని సుభాష్‌రోడ్‌, జేపీఎన్‌ రోడ్‌, సిరిసిల్లా రోడ్‌, స్టేషన్‌ రోడ్‌, కొత్త బస్టాండ్‌ ప్రాంతాల్లో వ్యాపారాలతో జనంతో రోడ్లన్ని కిక్కిరిసిపోయాయి. సద్దుల బతుకమ్మకు తంగేడు, గునుగు, బంతి, చామంతి, గులాబీ, రుద్రాక్ష, కట్ల పూల వ్యాపారులు జోరందుకున్నాయి. ఉదయం నుంచే గ్రామాల నుంచి రైతులు పూలను మార్కెట్లకు తరలిస్తుండగా, బతుకమ్మలను తీర్చిదిద్దేందుకు మహిళలు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేస్తున్నారు. పూల ధరలు కొంత పెరిగినప్పటికీ కొనుగోలుదారులు ఏమాత్రం వెనుకాడటం లేదు. బతుకమ్మ, దసరా పండుగను పురస్కరించుకుని బట్టల దుకాణాలు, రెడీమేడ్‌ షోరూమ్‌లు, బంగారు ఆభరణాల దుకాణాలు, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ షోరూమ్‌లు ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. కుటుంబ మేతంగా వెళ్లి కొత్త దుస్తులు కొనుగోలు చేస్తుండటంతో షాపింగ్‌ మాల్స్‌ కిటకిటలాడుతున్నాయి. మార్కెట్లలో విపరీతమైన రద్దీ నెలకొనడంతో ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement