కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌కు చెందిన తొమ్మిదేళ్ల బాలుడు అజాన్ ఈనెల 9వ తేదీన ఇంట్లో నిద్రిస్తుండగా కట్లపాము అతడి మెడకు చుట్టుకుని కాట్లు వేసింది. విషపూరితమైన పాము కావడంతో బాలుడు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లాడు. తల్లిదండ్రులు వెంటనే నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకురాగా.. పీడియాట్రిక్స్ హెచ్‌వోడీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం అత్యవసర చికిత్స అందించింది. నాలుగు రోజులపాటు వెంటిలేటర్‌పై ఉన్న బాలుడు వైద్యుల కృషితో చివరకు ప్రాణాలతో బయటపడ్డాడు. బాలుడు అజాన్ మంగళవారం జీజీహెచ్‌కు వచ్చి తన ప్రాణాలను కాపాడిన వైద్యులను సన్మానించాడు.
– నిజామాబాద్ అర్బన్


