మంజూరు ఒకచోట.. తరగతులు ఇంకోచోట | - | Sakshi
Sakshi News home page

మంజూరు ఒకచోట.. తరగతులు ఇంకోచోట

Sep 21 2026 7:17 AM | Updated on Sep 21 2026 7:17 AM

వసతులు లేక ఇతర ప్రాంతాలలో

నిర్వహణ

ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

నాగిరెడ్డిపేట: నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి గురుకులాలు మంజూరైనా.. సరైన వసతులు లేకపోవడంతో వాటిని వేరే చోట నిర్వహించాల్సి వస్తోంది. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఆయా విద్యాలయాలకు మంజూరైన చోటే సొంత భవనాలు నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

నాగిరెడ్డిపేటనుంచి సరంపల్లికి తరలింపు..

నాగిరెడ్డిపేట మండలానికి 2016లో గిరిజన బాలు ర గురుకుల పాఠశాల మంజూరయ్యింది. అప్పట్లో గురుకుల పాఠశాలను మండలకేంద్రం గోపాల్‌పేటలోని ఓ అద్దెభవనంలో ప్రారంభించారు. ఏడాదిపాటు కొనసాగింది. విద్యార్థుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో సరైన వసతులు కలిగిన భవనం మండలకేంద్రంలో అందుబాటులో లేకపోవడంతో మా ల్తుమ్మెదలోని మరో అద్దెభవనంలోకి తరలించారు. రెండేళ్ల తర్వాత విద్యార్థుల సంఖ్య మరింత పెరగడంతో కామారెడ్డి సమీపంలోని సరంపల్లి వద్ద గల ప్రైవేట్‌ భవనంలోకి మార్చారు. నాగిరెడ్డిపేట మండలానికి సంబంధించిన గురుకుల పాఠశాల ఏడేళ్లుగా సరంపల్లిలోనే కొనసాగుతోంది.

లింగంపేట నుంచి కామారెడ్డికి..

లింగంపేట మండలానికి 2016లో ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల మంజూరయ్యింది. సరైన వసతులతో కూడిన భవనం అందుబాటులో లేకపోవడంతో తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్‌కు తరలించారు. నాలుగేళ్ల తర్వాత కామారెడ్డికి మార్చారు. ఇప్పటికీ అక్కడే తరగతులు నిర్వహిస్తున్నారు.

తాడ్వాయి నుంచి కుప్రియాల్‌కు..

తాడ్వాయి మండలానికి 2017లో మహాత్మాగాంధీ జ్యోతీబా ఫూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల మంజూరయ్యింది. వసతుల లేమితో మొదట్లో మండలంలోని కృష్ణాజీవాడిలో పాఠశాలను నిర్వహించారు. రెండేళ్ల తర్వాత సదాశివనగర్‌ మండలంలోని కుప్రియాల్‌కు తరలించారు.

ఎర్రాపహాడ్‌నుంచి లింగంపేటకు..

తాడ్వాయి మండలానికి 2019లో బీసీ బాలుర గు రుకుల పాఠశాల మంజూరయింది. ఎర్రాపహాడ్‌లో రెండేళ్లపాటు తరగతులు నిర్వహించి.. సౌకర్యాల లేమి సాకుతో లింగంపేటకు తరలించారు. ప్రస్తు తం తాడ్వాయి మండలానికి చెందిన గురుకుల పా ఠశాల లింగంపేటలో కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement