కామారెడ్డి అర్బన్: రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారులకు ఆదివారం ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో అండర్–14, 16, 18, 20 బాలబాలికలు, మెన్, ఉమెన్‌లకు రన్స్, త్రోస్, జంప్స్ అంశాల్లో పోటీలు జరిగాయి. ఈ పోటీలలో ప్రతిభ చూపినవారిని ఈనెల 26, 27 తేదీల్లో హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్ తెలిపారు. కార్యక్రమంలో పీఈటీలు శ్రీనివాన్, శివాగౌడ్, మహేష్, ధర్మేంద్ర, అశోక్, నవీన్, హన్మంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


