జిల్లాలో నమోదైన వర్షపాతం
వివరాలు (మిల్లీమీటర్లలో)..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసంది. ఉదయం ఎండ, ఉక్కపోతతో ఇబ్బందికరంగా ఉన్న వాతావరణం.. మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఆహ్లాదకరంగా మారిపోయింది. జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాడ్వాయి మండలంలో మక్క, జొన్న, పత్తి, సోయా పంటలు దెబ్బతిన్నాయి. గాంధారి మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. ఆ సమయంలో బొప్పాజువాడి శివారులోని పత్తి చేనులో పనిచేసుకుంటున్న గ్రామానికి చెందిన మ్యాకల సూర్యకాంత్, బూర్గుల్ గ్రామానికి చెందిన గైని శంకర్‌ల సెల్‌ఫోన్లు పేలడంతో తీవ్రంగా గాయపడ్డారు. వారిని తోటి రైతులు కొంతదూరం ఎడ్లబండిపై తీసుకువెళ్లి అంబులెన్స్‌లో గాంధారి ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం కామారెడ్డిలోని జిల్లా జనరల్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న జగదాంబ, సేవాలాల్ గుడిపై పిడుగు పడడంతో శిఖరం ధ్వంసమయ్యింది.


