కామారెడ్డి అర్బన్: మున్నూరుకాపులు సమాజాభివృద్ధిలో చురుకుగా పాల్గొనాలని మున్నూరుకాపు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మామిండ్ల అంజయ్య, రాష్ట్ర కార్యదర్శి నీలం నర్సింలు అన్నారు. ఆదివారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్తగా ఎన్నికై న రామారెడ్డి మండల మున్నూరుకాపు సంఘం కార్యవర్గసభ్యులను ఘనంగా సన్మానించి మాట్లాడారు. సంఘం రామారెడ్డి మండల అధ్యక్షుడు ల్యాగల మహిపాల్, ప్రధాన కార్యదర్శి బండి లింగం, గౌరవ అధ్యక్షుడు చెన్నంశెట్టి రమేష్, ప్రతినిధులు భైరయ్య, సాయికుమార్, జిల్లా ప్రతినిధులు రావుల గంగాధర్, ముల్కరాజు, రాజు, రవి, లింగం తదితరులున్నారు.
భిక్కనూరు: మండలంలోని లక్ష్మీదేవునిపల్లి గ్రామ యూత్ కాంగ్రెస్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఆత్మకూరి అనిల్‌రెడ్డి, ఉపాధ్యాక్షుడిగా మాగిని రమేష్, పుల్లురి భూమయ్య, ప్రధాన కార్యదర్శిగా ఆలకుంట శ్రీకాంత్, సహాయకార్యదర్శులుగా మాగిని నరేష్, ప్రశాంత్, సోషల్ మీడియా ఇన్‌చార్జి ఆలకుంట మహేశ్, సలహాదారులుగా ఏనుగు మాదవ్‌రెడ్డి, ఎన్గు శ్రీనివాస్‌రెడ్డి, లింబారెడ్డి, రామ్‌రెడ్డి, నాగిరెడ్డి,మైపాల్‌రెడ్డి, రమేష్, ఎల్లం, నర్సింలు, భూమయ్యలు పాల్గొన్నారు.
బాన్సువాడ రూరల్: మండలంలోని బోర్లం గ్రామ లక్ష్మీనరసింహ స్వామి కల్యాణ మండపం, రెడ్డి సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా సంగం సాయిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పెద్ద పట్లోళ్ల దేవేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా భాస్కర్‌రెడ్డిలను ఎన్నుకున్నారు. అలాగే సంయుక్త కార్యదర్శిగా సుధాకర్‌రెడ్డి, కోశాధికారిగా రాజిరెడ్డిలను ఎన్నుకున్నారు. ఈసందర్బంగా నూతన పాలకవర్గాన్ని సభ్యులు అభినందించారు.
మద్నూర్ : మండల కేంద్రానికి చెందిన ఉత్తుర్‌వార్ సాయితేజకు ఎంబీబీఎస్‌లో మంచి సీటు రావడంతో మండల కేంద్రంలో ఆదివారం గ్రామస్తులు ఆదివారం సన్మానించారు. మండలంలోని ఐదుగురు విద్యార్థులు మెడికల్ పరీక్షలో ఉత్తీర్ణులై ప్రతిభను చాటుకున్నారు. మద్నూర్‌కు చెందిన మెడికల్ దుకాణం యజమాని సంతోష్ కుమారుడు రాష్ట్రంలో 866వ ర్యాంకు సాధించడంతో సాయితేజ్‌కు శాలువాతో సత్కరించి ఊరి పేరును నిలబెట్టాలని గ్రామస్తులు కోరారు. నాందేవ్‌మేసీ్త్ర, రచ్చ కుషాల్, శ్రీధర్, సంతోష్, పెంటేష్, నాగేశ్, యాదవ్‌రావ్ పలువురు ఉన్నారు.
భిక్కనూరు: అక్కినేని నాగేశ్వర్‌రావు 101వ జయంతి ఉత్సవాల సందర్బంగా హన్మకొండలో నిర్వహించిన నీరజ ఓరుగల్లు స్వరాలజల్లు కార్యక్రమంలో పాల్గొన్న భిక్కనూరు వాసి ట్రాన్స్‌కో ఉద్యోగి బాల్‌రాజును నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. బంగారు కుటుంబం సినిమాలోని అమ్మంటే ప్రేమకు రూపం పాటను బాలరాజు అలపించి అందరిని అలరించాడు.దీంతో నిర్వహకులు బాలురాజు సత్కరించి మెమెంటోను అందజేశారు. సంగీత దర్శకుడు రుద్రారపు విల్సన్, జబర్దస్త్ కమెడియన్ ప్రసాద్,నిర్వహకురాలు నీరజలు పాల్గొన్నారు.
నిజాంసాగర్(జుక్కల్): రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావాలని కన్యాకుమారి నుంచి కశ్మీర్‌కు పాదయాత్ర చేస్తున్న అడ్వకేట్ వెంకటేశ్వరరావుకు ఆదివారం మండలంలోని నర్సింగ్‌రావ్‌పల్లి చౌరస్తా వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అ
ధ్యక్షుడు ప్రజాపండరి స్వాగతం పలికారు. ఆయనతో పాటు మూడు కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ నాయకులు చాకలి. సాయిలు, వీరారెడ్డి, గైని. దత్తు, గైని. జగన్ తదితరులు పాల్గొన్నారు.


