నిజాంసాగర్(జుక్కల్): సర్వీస్ రోడ్లపై పశువులు కట్టేయడం, ట్రాక్టర్లను పార్కింగ్ చేసి, రోడ్లు బ్లాక్ చేస్తే చట్ట పరమైన కేసులు నమోదు చేస్తామని ఎస్సై శివకుమార్ హెచ్చరించారు. ఆదివారం మహమ్మద్ నగర్ మండలం గిర్నితండా గ్రామ పంచాయతీలోని కొన, నడిమి, గిర్నితండాల్లో రైతులు, గిరిజనులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు కల్గకుండా సర్వీస్ రోడ్లు వేశారన్నారు. ద్విచక్రవాహనదారులతో పాటు ప్రైవేట్, ఆర్టీసీ వాహనాల ప్రయాణానికి ఆటంకం కల్గించవద్దన్నారు.కార్యక్రమంలో నాయకులు సవాయిసింగ్, గంగారాం, మోహిన్ తదితరులు ఉన్నారు.


