రుద్రూర్: పోతంగల్ మండల కేంద్రానికి చెందిన జంగం ప్రదీప్ నాగలింగప్ప స్వామికి మ హారాష్ట్ర రాష్ట్రస్థాయి వేదశాస్త్రి పురస్కారం లభించింది. మహారాష్ట్రలోని సోలాపూర్ శివ యోగి సిద్ధ రామేశ్వర వైదిక పాఠశాలలో వేద అధ్యాపకులుగా సేవలందిస్తున్న ఆయనను ఆదివారం నాందేడ్‌లో ఘనంగా సత్కరించా రు. ప్రదీప్ జంగం స్వామి వేద విద్యను భవిష్యత్ తరాలకు అందించడంతో పాటు పలువురు విద్యార్థులకు వేదాధ్యయనంలో మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. వేదశాస్త్ర రంగంలో ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ మహా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయి పురస్కారానికి ఎంపిక చేసింది. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.


