టీజీఎస్‌హెచ్‌ఎంఏ కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

టీజీఎస్‌హెచ్‌ఎంఏ కార్యవర్గం ఎన్నిక

Sep 21 2026 7:17 AM | Updated on Sep 21 2026 7:17 AM

కామారెడ్డి టౌన్‌ : జిల్లా కేంద్రంలోని యోగా భవన్‌లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం (టీఎస్‌జీహెచ్‌ఎంఏ) సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులు ఎల్‌.రాజులు, శివ నరసింహారావుల ఆధ్వ ర్యంలో ఎన్నికల ప్రక్రియ సాగింది. జిల్లా అధ్యక్షుడిగా నీలం లింగం, ప్రధాన కార్యదర్శిగా ఎస్‌.వెంకటరమణ, కోశాధికారిగా డి. చందర్‌, రాష్ట్ర కౌన్సిలర్లుగా వెంకటేశం, సాయిరెడ్డి, రాజేంద్రప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజ గంగారెడ్డి, జిల్లాలోని గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

బీర్మల్‌ తండాను సందర్శించిన

తమిళనాడు పీఎస్‌

గాంధారి: తమిళనాడు ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ టీఎన్‌ వెంకటేశ్‌ ఆదివారం బీర్మల్‌ తండాను సందర్శించారు. మధుర లంబాడీలు తయారు చేసిన ఎంబ్రాయిడరీలను పరిశీలించారు. తయారీ విధానాన్ని తెలుసుకున్నారు. వారితో సరదాగా ముచ్చటించి అభినందించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రేణుక చౌహాన్‌, అధికారులు, తండావాసులు పాల్గొన్నారు.

జిల్లా కబడ్డీ

అసోసియేషన్‌ ఎన్నిక

తాడ్వాయి : జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. మండల కేంద్రంలోని గార్డెన్‌లో ఎన్నికల అధికారులు బత్తుల నారాయణ, విఠల్‌ రావు పాటిల్‌ సమక్షంలో ఎన్నికల ప్రక్రియ సాగింది. అధ్యక్షుడిగా బి.భాస్కర్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఏ.మధుసూదన్‌ రెడ్డి, ఏ.శ్యాంరావు, సీహెచ్‌.రవితేజ గౌడ్‌, దత్తు, ఎన్‌.మధుసూదన్‌రెడ్డి, జనరల్‌ సెక్రెటరీగా సీహెచ్‌.రాజు, జాయింట్‌ సెక్రెటరీలుగా పి.జగదీశ్వర్‌, తిరుమలరెడ్డి, సురేందర్‌గౌడ్‌, నరేష్‌, రాజేందర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా జి.లక్ష్మణ్‌, కె.నాగరాజు, లక్ష్మణ్‌ రాథోడ్‌, కె.శివారెడ్డి, సీహెచ్‌.శ్రీనివాస్‌, ఎం.నవీన్‌, జి.లక్ష్మణ్‌, పి.సందీప్‌. గౌరవ అధ్యక్షుడిగా సుభాష్‌రెడ్డి, అసోసియేషన్‌ చైర్మన్‌గా గడీల భాస్కర్‌లను ఎన్నుకున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement