జిల్లా కేంద్రంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని వాడవాడలా కొలువుదీరిన లంబోదరుడి విభిన్న ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వినాయక మండపాల కమిటీలు వినూత్న రీతుల్లో, సరికొత్త కాన్సెప్ట్‌లతో ప్రతిష్ఠించిన గణనాథులను దర్శించుకునేందుకు పట్టణ ప్రజలతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. పట్టణ మున్నూరుకాపు, పద్మశాలి, ముదిరాజ్, స్వర్ణకార, యువజన సమాఖ్య, నోబుల్ యూత్, శివవినాయక, కల్కి, పాంచ్‌రస్తా, కిరాణవర్తక, శాస్త్రి ఆదర్శ, గంజువర్తక, హిందుసేన, ఏక్‌దంత్, హిందూదళ్, వాయుసేన, బీడీఎస్‌ఎస్ తదితర సంఘాల మండపాల వినాయకులు ఆకట్టుకుంటున్నాయి. – కామారెడ్డిటౌన్
సిరిసిల్లారోడ్‌లోని నోబుల్ యూత్ మండపంలో ధనుర్ధారి గణనాథుడు
గొల్లవాడలో కాజు, బాదంలతో తయారు చేసిన వినాయకుడు
గర్ల్స్ హైస్కూల్ వద్దనున్న కల్కి యూత్
మండపంలో ఆటలాడుకుంటున్న గణపతి
హిందుసేన మండపంలో
తండ్రి చేతుల్లో బాల గణేశుడు


