బస్సు ప్రమాదం.. భీతిల్లిన ప్రయాణికులు | - | Sakshi
Sakshi News home page

బస్సు ప్రమాదం.. భీతిల్లిన ప్రయాణికులు

Sep 5 2026 5:49 AM | Updated on Sep 5 2026 5:49 AM

డ్రైవర్‌ మృతి.. ఎనిమిది మందికి గాయాలు

జాతీయ రహదారి 161 పై ఘటన

నిజాంసాగర్‌: సంగారెడ్డి– నాందేడ్‌ 161వ నంబర్‌ జాతీయ రహదారిపై జుక్కల్‌ మండలం కేంరాజ్‌ క ల్లాలి సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంట ల ప్రాంతంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కల్వర్టును ఢీకొని బోల్తాపడింది. హైదరాబాద్‌–1 డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌నుంచి బిచ్కుంద కు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమా దం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్‌, కండక్టర్‌తో పాటు 13 మంది ప్రయాణికులు ఉన్నారు. బ స్సు డోర్‌ ఊడిపోయి డ్రైవర్‌ కిందపడిపోగా.. అతడిపై బస్సు పడడంతో అక్కడికక్కడే మరణించాడు. కండక్టర్‌తోపాటు మరో ఎనిమిది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికులు భ యాందోళనలకు గురయ్యారు. గాయపడినవారిని బిచ్కుంద ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మృతిచెందిన బస్సు డ్రైవర్‌ ఆంజనేయులు(52) స్వ గ్రామం మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండ లం డోకూర్‌ గ్రామంలోని తెలుగువీధి. కండక్టర్‌ బీ రప్ప ఇబ్రహీంపట్నంకు చెందినవారు. పెద్దకొడప్‌గల్‌ మండలానికి చెందిన యు.సాయిలు, బీర్కూర్‌ మండలం హజీపూర్‌ గ్రామానికి చెందిన సాయిలు, మద్నూర్‌ మండలం చిన్న ఎక్లారా గ్రామానికి చెందిన భీంరావు, జుక్కల్‌ మండలం మహమ్మదాబాద్‌కు చెందిన సోనాబాయి, ఆమె కుమారుడు గంగాధర్‌, మద్నూర్‌ మండలం దన్నూర్‌కు చెందిన యుమునబాయి, జుక్కల్‌ మండలం హంగర్గకు చెందిన స్వాతి, సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌ మండలానికి చెందిన అనురాధలకు గాయాలయ్యాయి.

పరామర్శించిన ఎమ్మెల్యే

ప్రమాద విషయం తెలుసుకున్న జుక్కల్‌ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు బిచ్కుంద ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కాగా ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement