ఊరుమెచ్చిన ఉపాధ్యాయుడు.. | - | Sakshi
Sakshi News home page

ఊరుమెచ్చిన ఉపాధ్యాయుడు..

Sep 5 2026 5:49 AM | Updated on Sep 5 2026 5:49 AM

బాన్సువాడ రూరల్‌: తాను పనిచేసే ప్రతిచోటా అంకితభావంతో అందరి మన్ననలు అందుకుంటూ ఊరుమెచ్చిన ఉపాధ్యాయుడిగా పేరొందారు బాన్సువాడ మండలం బోర్లం జెడ్పీ హైస్కూల్‌ హెచ్‌ఎం వెంకటరమణ. గ్రామ పూర్వ విద్యార్థుల సహకారంతో విద్యార్థులకు ఇనుప బెంచీలు అందుబాటులోకి తీసుకొచ్చారు. కోడ్‌ హోప్‌ గ్లోబర్‌ అనే ఎన్‌జీవో ప్రతినిధులను ఒప్పించి పాఠశాలకు 10 కంప్యూటర్లు విరాళంగా మంజూరు చేయించి ప్రత్యేకంగా ల్యాబ్‌ ఏర్పాటు చేయించారు. తాను విరాళం ఇవ్వడమే కాకుండా తోటి ఉపాధ్యాయ బృందంతో కలిసి పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement