ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా? | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా?

Sep 5 2026 1:56 AM | Updated on Sep 5 2026 1:56 AM

లింగంపేట: ఇచ్చిన హామీలను అమలు చేయా లంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా అని ఎ ల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ నిరసనల్లో భాగంగా శుక్రవా రం లింగంపేటలో వంటావార్పు చేపట్టారు. అంబేడ్కర్‌ చౌరస్తాకు చేరకోగానే ధర్నాకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యేకు, పోలీసులకు మధ్య వాగ్వా దం చోటు చేసుకుంది. సురేందర్‌ రోడ్డుపైనే బైఠాయించారు. అనంతరం వాంటా వార్పు చేపట్టి నాయకులు, కార్యకర్తలతో సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దివిటి రమేశ్‌, నాయకులు ముదాం సాయిలు, గాండ్ల నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement