ఐదు కిలోమీటర్లు.. అష్టకష్టాలు | - | Sakshi
Sakshi News home page

ఐదు కిలోమీటర్లు.. అష్టకష్టాలు

Aug 19 2026 1:18 AM | Updated on Aug 19 2026 1:18 AM

వాహనాలు దెబ్బతింటున్నాయి

పనులు పూర్తి చేసేలా చూస్తాం

మూడేళ్లుగా సాగు..తున్న దోమకొండ

ముత్యంపేట బీటీ రోడ్డు పనులు

కంకర పొసి వదిలేసిన కాంట్రాక్టర్‌

ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

దోమకొండ: ఐదు కిలోమీటర్ల కంకర రోడ్డు ప్రజల ను ప్రయాణికులను కష్టాల పాలు చేస్తుంది. దో మకొండ మండల కేంద్రం నుంచి ముత్యంపేట గ్రా మం వరకు ప్రారంభించిన బీటీరోడ్డు నిర్మాణ మూ డేళ్లుగా కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని సిరిసిల్లారోడ్డు క్యాసంపల్లి నుంచి దోమకొండ మండల కేంద్రం మీదుగా గొట్టిముక్కుల, లక్ష్మీదేవునిపల్లి నుంచి భిక్కనూరు మండల కేంద్రం వరకు బీటీ రో డ్డును నిర్మించాల్సి ఉంది. అప్పట్లో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ చేతుల మీదుగా పనులను ప్రారంభించారు. సదరు కాంట్రాక్టర్‌ పనులను ముత్యంపే ట గ్రామం వరకు చేసి వదిలేశారు. మిగతా పనులు చేయాలని మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్‌తో పాటు, అధికారులకు పలుమార్లు విన్నవించారు. దీంతో సదరు కాంట్రాక్టర్‌ గత ఏడా ది క్రితం ముత్యంపేట నుంచి దోమకొండ మండల కేంద్రం వరకు మట్టిరోడ్డు తీసి కంకర పోసి వదిలేశారు. దీంతో రోడ్డు మరింత అధ్వానంగా తయారైంది. ప్రతి నిత్యం మండల కేంద్రంతో పాటు బీబీ పేట మండలానికి చెందిన పలు గ్రామాల నుంచి ముత్యంపేట మీదుగా నిత్యం వందలాది మంది వాహనదారుల కామారెడ్డి జిల్లా కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం ఈదారి వెంట వెళ్తుంటారు. కంకర కు వాహనాలు దెబ్బతినడంతో పాటు దుమ్ము, ధూ ళితో తీవ్ర అవస్థలు పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు.ఈ విషయంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బీటీ రోడ్డు వే సేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరు తున్నారు.

మాది బీబీపేట మండల కేంద్రం. కామారెడ్డిలో పనిచేస్తా. ప్రతిరోజు ఉదయం కామా రెడ్డి వెళ్లి తిరిగి సాయంత్రం వస్తా. ముత్యంపేట నుంచి కామారెడ్డికి దగ్గరగా ఉంటుందని బైక్‌పై వెళ్తా. కంకర రోడ్డుతో వాహనాలు దెబ్బతింటున్నాయి. దోమకొండ నుంచి ముత్యంపేట వరకు కంకర పోసి వదిలేయడంతో దుమ్ము ధూళీతో ఇబ్బందులు పడుతున్నాం. – బదిరే నవీన్‌, బీబీపేట

వర్షాలు తగ్గగానే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. కాంట్రాక్టర్‌కు బిల్లులు రానందున ఆలస్యం జరిగిందని, త్వరలోనే బీటీ పనులు పూర్తి చేసేలా చూస్తాం.

– రవితేజ, ఏఈ, ఆర్‌అండ్‌బీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement