దేవుడంటే భయం లేదు... జరిమానా అంటే లెక్కలేదు | - | Sakshi
Sakshi News home page

దేవుడంటే భయం లేదు... జరిమానా అంటే లెక్కలేదు

Aug 19 2026 1:18 AM | Updated on Aug 19 2026 1:18 AM

కామారెడ్డిలోని అశోక్‌నగర్‌ కాలనీలో హనుమాన్‌ ఆలయం సమీపంలో ఖాళీ ప్రదేశం చెత్తకు నిలయమైంది. ఎక్కడెక్కడి నుంచో చెత్తను తెచ్చి అక్కడ పారేసి వెళ్తున్నారు. ఇటీవల మున్సిపల్‌ సిబ్బంది చెత్త వేస్తే రూ.500 జరిమానా విధిస్తామని అనే ఫ్లెక్సీ పెట్టినా ఎవరూ పట్టించుకోవడం లేదు. దేవుడంటే భయం లేదని, జరిమానా అంటే లెక్కలేదని రోడ్డున వెళ్తున్న వారు చర్చించుకుంటున్నారు. రోజూ చెత్త సేకరణ ఆటో వస్తే ఇబ్బంది ఉండదని స్థానికులు అంటున్నారు.

–సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement