‘అదనపు గదులు నిర్మించాలి’
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదులు నిర్మించి, మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వ సలహాదారు షబ్బీ ర్ అలీని కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లో షబ్బీ ర్ అలీని కలిసి వినతిపత్రం అందించారు. కళాశాల లో 8 కోర్సుల్లో వెయ్యి మందికిపైగా విద్యార్థులు న్నారని, తరగతి గదుల కొరతతో చెట్ల కింద చదువుకోవాల్సి వస్తోందన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ, విద్యార్థి సేన, జీవీఎస్, బీసీ విద్యార్థి సంఘాల నాయకులు అరుణ్, విఠల్, వినయ్, వినోద్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
షబ్బీర్‌అలీకి రుణపడి ఉంటాం
భిక్కనూరు : మండలకేంద్రానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను మంజూరు చేయించినందుకు షబ్బీర్‌అలీ రుణపడి ఉంటామని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం కామారెడ్డిలో షబ్బీర్‌అలీని కలిసి సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు ఇంద్రకరణ్‌రెడ్డి, చంద్రకాంత్‌రెడ్డి, రేఖ, సుదర్శన్, లింగారెడ్డి, భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన భోజనాన్ని అందించాలి
మాచారెడ్డి: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని పాల్వంచ మండల విద్యాధికారి రామ్ మనోహర్ రావు సూచించారు. మంగళవారం ఇసాయిపేట గ్రామంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థుల హాజరు నమోదు, ఉపాధ్యాయుల ఎఫ్‌ఆర్‌ఎస్, పాఠశాల పరిసరాలు,తరగతి గదులను ఆయన పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, వంట నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. హెచ్‌ఎం దయానంద్, ఉపాధ్యాయులు భాగ్యలక్ష్మి, సాగర్, గిరిధర్ ఉన్నారు.
పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో
సదాశివనగర్ : మండలంలోని ధర్మారావ్‌పేట్ ప్రాథమిక పాఠశాలను ఎంఈవో యోసెఫ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ప్రభుత్వ మెనూను తప్పకుండా పాటించాలన్నారు. ఉపాధ్యాయులు ప్రార్థన సమయానికి పాఠశాలకు హాజరు కావాలని సూచించారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సదాశివ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


