డ్వాక్రా మహిళలు ఆర్థికంగా ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

డ్వాక్రా మహిళలు ఆర్థికంగా ఎదగాలి

Aug 19 2026 1:18 AM | Updated on Aug 19 2026 1:18 AM

డ్వాక్రా మహిళలు ఆర్థికంగా ఎదగాలి మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి వసతి గృహ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ జైలు అనుభవానికి ఆహ్వానం

ఎల్లారెడ్డి: డ్వాక్రా సంఘం మహిళలు ఆర్థికంగా అభివృద్ధిని సాధించాలని అడిషనల్‌ డీఆర్‌డీవో విజయ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డిలో ని ర్వహించిన మండల సమాఖ్య మహాజన సభ కు ఆమె హాజరై మాట్లాడారు. డ్వాక్రా సంఘా ల సభ్యులు ఇంటర్‌, టెన్త్‌ పరీక్షలు రాసి చదువు లో అభివృద్ధి సాధించాలన్నారు. ఈకేవైసీని సై తం చేసుకోవాలన్నారు. జిల్లా, మండల సమాఖ్యలు అధ్యక్షురాళ్లు పావని, పుష్పరాణి, ఎంపీడీవో తాహేరాబేగం, ఏపీఎం రాంనారాయణ గౌడ్‌, సీసీలు తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి అర్బన్‌: మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎం.చంద్రకాంత్‌రెడ్డి అన్నారు. మాదక ద్రవ్యాల నిరోధక విభాగం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా గ్రంథాలయ సంస్థలో మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన, చైతన్య కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థు లు నిరంతర కృషి, సమయపాలన, క్రమశిక్షణ పాటిస్తూ ఆత్మవిశ్వాసంతో విజయాలు సాధించాలన్నారు. మాదకద్రవ్యాల నిరోధక విభాగం హెదరాబాద్‌ సర్కిల్‌ సీఐ గడ్డం మల్లేశ్‌, స్థానిక ఎస్‌ఐ సందీప్‌లు మాదక ద్రవ్యాల వినియోగంతో వచ్చే అనర్థాలను వివరించారు. పరీక్షల వి ధానం, మెలకులను వివరించారు. సిబ్బంది కి షన్‌, శంకర్‌, సందీప్‌ తదితరులున్నారు.

బాన్సువాడ రూరల్‌ : వసతి గృహంలో చదువుకుంటున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిర్లక్ష్యం చేయవద్దని జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమ అధికారి వెంకటేశ్‌ అన్నారు. మండలంలోని బోర్లంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో విద్యార్థుల కోసం వండిన వంటకాలను ఆయన పరిశీలించారు. విద్యార్థుల హాజరు, మెనూ చార్టు, స్టాక్‌ రిజిస్టర్లు, ఇతర సంబంధిత రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని సూచించారు. వసతి గృహ విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు.

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలం వెల్లుట్లపేట గ్రా మంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు స ర్పంచ్‌ వినోద మంగళవారం భూమిపూజ చేశా రు. రెండో విడతలో గ్రామానికి నాలుగు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ఇంటి నిర్మా ణ పనులకు సర్పంచ్‌ భూమి పూజ చేశారు.

నిజామాబాద్‌ అర్బన్‌: హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో జైలు అనుభవం అనే కార్యక్రమం అందుబాటులో ఉందని జిల్లా జైలు సూపరిండెంట్‌ ఆశోక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు వాస్తవిక అవగాహన కల్పి ంచడంతోపాటు స్వేచ్ఛ విలువలను తెలియజేయడం కోసం ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఎవరైన ఆసక్తి గల వారు జైలు అనుభవం కోసం వెళ్లదలచిన వారు ఫీల్‌ ఇవెంట్‌ పేజీ ద్వారా టికెట్‌ బుక్‌చేసుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులని, 12 గంటల జైలు అనుభవానికి రూ.1000, 24 గంటల అనుభవానికి రూ.2వేలు రుసుం విధించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement