బాన్సువాడ : ఆడపిల్లల పెళ్లిలకు తులం బంగారం కోసం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రజ లు నిలదీస్తున్నారని బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ప్రజలు, రైతులే కాదు సొంత పార్టీ ఎమ్మెల్యేలే సీఎం రేవంత్‌రెడ్డిని కొడతారని ఆయన విమర్శించారు. మంగళవారం బాన్సువాడ అంబేడ్కర్ చౌరస్తా వద్ద బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో గ్రామాల్లో పర్యాటించిన సీఎం రేవంత్‌రెడ్డి కల్యాణ లక్ష్మి పథకంతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన వీడియోను బాజిరెడ్డి ప్రజలకు వినిపించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని రద్దు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర పన్నారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వం రైతు బీమా నిధులు చెల్లించకపోవడంతో నిలిచిపోయిందన్నారు. ప్రభుత్వ మోసాలను ప్రజలకు తెలియజేయాలని కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి మండల కేంద్రంలో ధర్నాలు చేస్తున్నామన్నారు. కార్యకర్తలు బతికి ఉన్నప్పుడు పోచారం పట్టించుకోలేదని, చనిపోయిన వారి ఇళ్లకు వెళ్లి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని, పోచారం కంటే సీఎం రేవంత్‌రెడ్డి డబుల్ మోసగాడని విమర్శించారు. మంత్రులు ఫోన్‌లు ఎత్తడం లేదని, అప్పుడే అభివృద్ధి కోసం పార్టీ మారానని, తాను కప్పుకున్నది కాంగ్రెస్ కండువా కాదని, జాతీయ కండువా అని పోచారం అబద్ధాలు చెప్పడం ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు పెట్టిన భయపడవద్దన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి ఆర్డీవో రవీందర్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వీజీ.గౌడ్, సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్‌చార్జి ఆగయ్య, నాయకులు మోరిల్ శ్రీనివాస్‌రావు, అంజిరెడ్డి, జుబేర్, రత్నకుమార్, ఎర్రవాటి సాయిబాబా, బాడి శ్రీనివాస్, అక్బర్, ఇసాక్, రమేష్‌యాదవ్, మోచీ గణేష్, శివసూరి, ఖలీల్, ఫేరోజ్, ఇక్బా ల్, ఉమ మహేష్, గాండ్ల కృష్ణ, సాయిలు, కొండని రాము, బోలబోయిన శేఖర్ తదితరులున్నారు.
మద్నూర్/పిట్టం(జుక్కల్): పేదింటి ఆడబిడ్డల వి వాహనికి భరోసాగా నిలుస్తున్న కల్యాణలక్షి, షా దీముబారక్ పథకాన్ని రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. మద్నూర్ మండల కేంద్రంలోని పా త హైవేపై మంగళవారం బీఆర్‌ఎస్ నాయకులు ధ ర్నా చేపట్టారు.అలాగే పిట్లం మండల కేంద్రంలో బీ ఆర్‌ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. అనంతరం ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
తులం బంగారం కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారు
పోచారం కంటే డబుల్ మోసగాడు సీఎం
బాన్సువాడలో మాజీ ఎమ్మెల్యే
బాజిరెడ్డి గోవర్ధన్


