ఫర్టిలైజర్‌ యాప్‌పై అవగాహన | - | Sakshi
Sakshi News home page

ఫర్టిలైజర్‌ యాప్‌పై అవగాహన

Aug 4 2026 1:29 AM | Updated on Aug 4 2026 1:29 AM

ఫర్టిలైజర్‌ యాప్‌పై అవగాహన

లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం ఫర్టిలైజర్‌ యాప్‌పై డీలర్లకు అవగాహన కల్పించినట్లు మండల వ్యవసాయాధికారి అనిల్‌కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఏడు మండలాల ఫర్టిలైజర్‌ డీలర్ల అవగాహన సదస్సులో మాట్లాడారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోయో ‘ఫ్రేమ్‌వర్క్‌ ఆన్‌ ఫర్టిలైజర్‌ సెల్‌’ యాప్‌ పనితీరును వివరించారు. అనంతరం ఏడీఏ సుధా మాధురి మాట్లాడారు. ప్రతి డీలర్‌ తమ ఈ పాస్‌ ద్వారా రైతులు యాప్‌ ద్వారా బుక్‌ చేసుకున్న యూరియా క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ఇవ్వవలసి ఉంటుందన్నారు. ఈయాప్‌ సేవలు ఈనెల 6 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. ఏడు మండలాల డీలర్లు, ఆయా మండలాల వ్యవసాయాధికారులు, ఏఈవోలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement