పెద్ద కోడలు, చిన్న కొడుకు కలిసి తనను ఇంటి నుంచి గెంటివేశారని, పోషణ ఖర్చులు ఇప్పించాలని కోరుతూ జిల్లా కేంద్రం లోని అశోక్ నగర్ కాలనీకి చెందిన హుస్సేన్ బీ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తనకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉండగా అందరి పెళ్లిళ్లు జరిగాయని తెలిపారు. పెద్దకొడుకు చనిపోగా, చిన్న కొడుకుకు విడాకులయ్యాయి. వివాదాల కారణంగా పెద్దకోడలు, చిన్న కొడుకు కలిసి ఆస్తి మొత్తం లాక్కుని, తనను ఇంటి నుంచి గెంటివేశారని హుస్సేన్‌బీ వాపోయారు.పెద్ద కోడలు, చిన్న కొడుకుల నుంచి తనకు రక్షణ కల్పించాలని, పోషణ ఖర్చులు, ఆస్తిలో వాటా ఇప్పించాలని కోరారు. ఇదివరకే పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా పరిష్కారం చూపలేదన్నారు. సమస్యను పరిష్కరించాలని మరోసారి కలెక్టర్‌కు విన్నవించుకున్నట్లు తెలిపారు.


