ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో సో మవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించినట్లు ఆర్డీవో కార్యాలయ సిబ్బంది తెలిపారు. వీటిలో రెండు అటవీశాఖ, ఒకటి పంచాయతీరాజ్‌కు సంబంధించిన ఫిర్యాదులు వచ్చినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో మున్సి పల్ కమిషనర్ జగ్జీవన్,డీఎల్‌పీవో సురేందర్, ఆర్డీ వో కార్యాలయ ఏవో తదితరులు పాల్గొన్నారు.
పెద్దకొడప్‌గల్(జుక్కల్):మండలకేంద్రంలో సో మవారం నిర్వహించిన ప్రజావాణికి కార్యక్రమానికి పలువురు అధికారులు గైర్హాజరయ్యా రు. తహసీల్దార్ రాజశేఖర్, ఎంపీడీవో అభినవ్ చందర్, ఎంపీవో లక్ష్మీకాంత్ రెడ్డి,ఎంఈవో ప్ర వీణ్ కుమార్, అటవి శాఖ అధికారులు హాజరయ్యా రు.విద్యుత్,వైద్యశాఖ, తదితరశాఖల అధికారు లు డుమ్మా కొట్టారు. ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు హాజరయ్యేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
● నిలిచిన వాహనాల రాకపోకలు
బోధన్‌టౌన్(బోధన్): పట్టణంలోని గాంధీ పార్కు వద్ద గల రైల్వే గేట్‌ను సోమవారం పొక్లెయిన్ ఢీకొనడంతో ధ్వంసమైంది. దీంతో గేట్ పనిచేయకపోవడంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యింది. అదే సమయంలో రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలు వస్తుండడంతో రైల్వే సిబ్బంది గేటును వేయడానికి ప్రయత్నించినా ఎంతకు గేటు పడక పోవడంతో, ట్రాఫిక్ పోలీసులు, తాడును కట్టి ట్రాఫిక్‌ను నియంత్రించారు. అప్పటికే రెండు వైపులా వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో వాహనదారులు ఎక్కువ సమయం అక్కడే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
కామారెడ్డి అర్బన్: రామారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈనెల 6న ఫుట్‌బాల్ జి ల్లా జట్లను ఎంపిక చేయనున్నారు. ఈ విషయాన్ని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యద ర్శి శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల బాలబాలికలు అండర్–15, 17 ఫుట్‌బాల్ జట్ల ఎంపిక పోటీల్లో పాల్గొనాలని సూచించారు. జిల్లా జట్లకు ఎంపికై నవారు ఈనెల 18 నుంచి 24 వ తేదీ వరకు నిర్వహించే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌లో పాల్గొంటారని పేర్కొన్నారు.


