నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న ఫంక్షన్ హాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని భిక్కనూర్‌కు చెందిన ఆర్టీఐ జిల్లా ప్రతినిధి గంగల రవీందర్ తెలిపారు. ఆయన కలెక్టరేట్‌కు వచ్చి మరోసారి ఫిర్యాదు చేశారు. ఇరిగేషన్ శాఖలోని ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ నిబంధనలను తుంగలో తొక్కుతూ గ్రామానికి ఆనుకుని ఉన్న స్ధలంలో ఫంక్షన్‌హాల్ నిర్మాణం జరిగిందన్నారు. ఈవిషయమై మరోసారి ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.


