రూ.వెయ్యి కోట్లతో ప్రభుత్వ కార్యాలయ భవనాలు | - | Sakshi
Sakshi News home page

రూ.వెయ్యి కోట్లతో ప్రభుత్వ కార్యాలయ భవనాలు

Jul 13 2026 1:16 AM | Updated on Jul 13 2026 1:16 AM

బాన్సువాడ : పదేళ్లలో బాన్సువాడ నియోజకవర్గంలో రూ.1000 కోట్ల నిధులతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలను నిర్మించామని ప్రభు త్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధిలో బాన్సువాడను రా ష్ట్రంలోనే నంబర్‌ వన్‌గా నిలిపి ఆదర్శంగా నిలిచా మని అన్నారు. ఆదివారం బాన్సువాడ ఎంసీహెచ్‌ లో పోలీస్‌ అవుట్‌ పోస్ట్‌, శాశ్వత సదరం శిబిరం, ట్రాఫిక్‌ అవుట్‌ పోస్ట్‌లను ఎస్పీ రాజేశ్‌చంద్ర, ఆగ్రో ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ కాసుల బాల్‌రాజ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ రూ.29 లక్షలు, ఎస్‌డీఎఫ్‌ రూ.15 లక్షలతో నిర్మించిన రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ శాంతి భద్రతలు లేనిచోట అభివృద్ధి జరగదని అన్నారు. ప్రభు త్వ ప్రతిష్టను దృష్టిలో ఉంచుకొని కొన్నిసార్లు ఎస్పీ కఠినంగా వ్యవహరించినా అందరూ అర్థం చేసుకోవాలని సూచించారు. 30 ఏళ్లుగా తనను పోలీసు వ్యవస్థ కంటికి రెప్పలా కాపాడుతూ వస్తుందని అ న్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో అన్ని ప్రభు త్వ కార్యాలయాలు, వసతిగృహాలు, కళాశాలలు, పాఠశాలలు, ఆస్పత్రులు అన్ని కలిపి రూ.1000 కోట్లతో సొంత భవనాలు నిర్మించామని అన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా బాన్సువాడ నియోజకవర్గంలో సుమారు లక్ష ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారని తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో కొంత ఇబ్బందిగా ఉన్నా రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులో లేని నీరు నిజాంసాగర్‌లోనే ఉందని, చివరి వరకు చూసి వేసిన పంటలకు ప్రాణం పోసేందుకు నీటిని నిడుదల చేస్తామని అన్నారు. జిల్లాలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ రాజేశ్‌చంద్ర అన్నారు. ప్రమాదాల నివారణకు ట్రా ఫిక్‌ వ్యవస్థ చాలా అవసరమని అందుకే బాన్సువాడలో ఎస్సై, 8 మంది సిబ్బందితో ట్రాఫిక్‌ వ్యవస్థ ను ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 50 మంది ప్రాణాలు కాపాడామని, ప్రమా దాలను తగ్గిస్తున్నామని, ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు. బాన్సువాడ ఆస్పత్రిలో శాశ్వత సద రం శిబిరం ఏర్పాటు చేయడంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగకరమని ఆగ్రో ఇండసీ్ట్రస్‌ చైర్మన్‌ కాసుల బాల్‌రాజ్‌ అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రవీందర్‌రెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ విజయభాస్కర్‌, డీసీసీబీ మాజీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, టౌన్‌, రూరల్‌ సీఐలు శ్రీధర్‌, తిరుపయ్య, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

రాష్ట్రంలోనే బాన్సువాడను

నంబర్‌ వన్‌గా నిలిపాం

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు

పోచారం శ్రీనివాస్‌ రెడ్డి

బాన్సువాడలో పోలీసు

కార్యాలయ భవనాలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement